Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాసబ్‌ ట్యాంకులోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో ఆదివాసీల గుస్సాడి, దింసా నృత్యాలతో కోళాహాలంగా, కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్‌ హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా ఎమ్మెల్సీ ఎంఎస్‌ ప్రభాకర్‌ రావు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీల అభ్యున్నతి కోసం పనిచేసిన గొప్ప వారిని సన్మానించారు. 10 మంది గిరిజన పారిశ్రామిక వేత్తలకు సీఎం ఎస్టీ ఎంటర్‌ ప్రెన్యుర్‌ షిప్‌ పథకం కింద 4.4 కోట్ల చెక్‌ అందించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణలో ఆదివాసీల సంస్కృతి పరిరక్షిస్తూ, సంక్షేమానికి పాటుపడుతూ, అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్నామని అన్నారు.గిరిజన గురుకులాల్లో చదివి.. ఆయా ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img