Friday, April 26, 2024
Friday, April 26, 2024

హైదరాబాద్కు భారీ వర్ష సూచన..

అల్పపీడన ప్రభావంతో హైద‌రాబాద్ లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఉపరితల ఆవర్తనం, 7న అల్పపీడనం ఏర్పడే అవకాశముందన్నారు. సోమవారానికి అది వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంద‌న్నారు. ఇది ఉత్తర దిశగా బంగాళాఖాతం వైపునకు కదలుతూ తీవ్రతరమై తుఫానుగా బలపడుతుందన్నారు. ఈ తుఫాను ప్రభావంతోనూ గ్రేటర్‌లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img