Friday, December 9, 2022
Friday, December 9, 2022

కొయ్యలగూడెం మండలాభివృద్ధికి సహకరిస్తా

సిఎం జగన్

కొయ్యలగూడెం: కొయ్యలగూడెం మండల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రిని కొయ్యలగూడెం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గంజిమాల రామారావు, పశ్చిమ డెల్టా బోర్డు చైర్మన్ గంజిమాల దేవి కలిసారు. పోలవరం శాసన సభ్యులు తెల్లం బాలరాజు తోడ్పాటుతో మండలంలో జరిగే కార్యక్రమాలను ఎంపిపి స్వయంగా ముఖ్యమంత్రికి వివరించారు. ఏజెన్సీ ముఖద్వారమైన కొయ్యలగూడెం అభివృద్ధికి శాసన సభ్యులు చేస్తున్న కృషికి మరిన్ని ఆశీస్సులు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరినట్లు గంజిమాల రామారావు తెలిపారు . ప్రత్యేకంగా బాల్య వివాహాల లేకుండా చేయటానికి మండలంలో చేపడుతున్న కార్యక్రమాలకు ముఖ్యమంత్రి స్పందించారు. ఇలాంటి సామాజిక అంశాలపై కార్యక్రమాలు చేపట్టడం ముదావహమని గంజిమాల రామారావు భుజం తట్టి ముఖ్యమంత్రి ప్రోత్సహించారు. కొయ్యలగూడెం కార్యక్రమం వివరాలు కార్యాలయానికి వెళ్ళిన తర్వాత తనకు బ్రీఫ్ చేయాలని తన ప్రత్యెక కార్యదర్శికి ముఖ్యమంత్రి సూచించటం విశేషం. ఈ విషయాలను ఎంపీపీ కొయ్యలగూడెంలో గురువారం మీడియాకు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img