Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

‘పోక్సో’ నేరాల్లో 99 శాతం బాలికలపైనే..

ఎన్‌సీఆర్‌బీ 2020 నివేదిక
న్యూదిల్లీ : దేశంలో బాలికలకు ముఖ్యంగా యుక్తవయస్సులో ఉన్న వారికి రక్షణ కరవైంది. అతివల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా.. శిక్షలను కఠినతరం చేసినాగానీ బాలికలు, యువతులు, మహిళలపై నేరాలుఘోరాలు ఆగడం లేదు. ఇదే విషయం జాతీయ నేరాల నమోదు బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) 2020 నివేదికలో స్పష్టమైంది. పోక్సో చట్టం కింద 2020లో నమోదు అయిన 99 నేరాలు 1618 ఏళ్ల బాలికలపైనే జరిగినట్లు డేటా చెబుతోంది. ఇదే విషయాన్ని ఎన్జీవో చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ యూ (క్రై) కూడా నొక్కిచెప్పింది. బాలికల సంరక్షణపై ఆందోళన వ్యక్తంచేసింది. ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం పోక్సో చట్టం కింద 28,327 నేరాలు నమోదు కాగా అందులో 28,058 బాలికలపై జరిగినవే కాగా 1618 వయస్సుగల అమ్మాయిలపై 14,092 నేరాలు నమోదు కాగా అందులో 1216 మధ్య వయస్సుగల బాలికలపై జరిగినవి 10,949 నేరాలు ఉన్నట్లు వెల్లడైంది. బాలురు, బాలికలు అన్న తేడా లేకుండా నేరాలు జరుగుతున్నప్పటికీ బాలికలే ఎక్కువగా లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ఎన్‌ఆర్‌సీబీ పేర్కొంది. సోమవారం అంతర్జాతీయ ఆడశిశువు దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘క్రై’ పాలసీ రీసెర్చ్‌ డైరెక్టర్‌, అడ్వకసీ ప్రీతి మహారా స్పందించారు. సామాజిక భద్రత, విద్య, పేదరికం వంటివి బాలికల సాధికారతకు కీలకమన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో బాలికలపై నేరాలు పేట్రేగిపోయాయని, బాల్యవివాహాలు పెరిగాయని, వారు విద్యకు దూరమయ్యారని, హింస, లైంగిక వేధింపులకు గురయ్యారని తెలిపారు. బాలికల రక్షణకు పటిష్ఠ యంత్రాంగం ఎంతైనా అవసరమని నొక్కిచెప్పారు. ఇటీవల బాలికల విద్య, సామాజిక రక్షణ, సాధికారత దిశగా జరిగిన కొద్దిపాటి పురోగతి కోవిడ్‌ మహమ్మారి వేళ బూడిదలో పోలిన పన్నీరైందన్నారు. స్కూల్‌ డ్రాపౌట్లలో బాలికలే ఎక్కువన్నారు. యుక్త వయస్సు బాలికలపై లైంగిక నేరాలు ఎక్కవని, ఇలాంటి పరిస్థితి మానవతా సంక్షోభమని, దీని పరిష్కారానికి ‘ జెండర్‌ రెస్పాంసీవ్‌ ప్రొటెక్షన్స్‌ ఇంటర్విషన్స్‌’ అమలు తక్షణావసరమని మహారా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img