Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఉపరితల ద్రోణి ప్రభావం..తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

ఉపరితల ద్రోణి ప్రభావం, వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులతో తెలుగురాష్ట్రాల్లో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.. హైదరాబాద్‌ లో ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్‌, వనస్థలిపురం, అంబర్‌ పేట్‌, హిమాయత్‌నగర్‌, రామంతపూర్‌, గోల్నాక, నాగోల్‌, నాంపల్లి, ఖైరతాబాద్‌, మాసబ్‌ ట్యాంక్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, సోమాజిగూడ, దిల్‌షుఖ్‌నగర్‌, ఉప్పల్‌, మలక్‌పేట్‌, సైదాబాద్‌ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. మూడు రోజులుగా తెలంగాణలోని నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, వరంగల్‌, వికారాబాద్‌ తదితర పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు పంటలకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. రోడ్లపై వాననీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఇక ఏపీలోని పలు జిల్లాల్లో ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రకాశం జిల్లాలోనూ మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణం చల్లబడిరది. మొక్క జొన్న, పత్తి, వరి, పండు మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img