Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ఖరీఫ్‌లో ధాన్య సేకరణ భేష్‌.. : సీఎం జగన్‌

రైతులకు మిల్లర్లతో పని ఉండకూడదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలవద్ద విక్రయంతోనే రైతుల పని పూర్తికావాలి, ఆ తర్వాత బాధ్యత అంతా ప్రభుత్వానిదే కావాలని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారు. మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా తొలిసారిగా ధాన్యం సేకరణ ఈ ఏడాది ఖరీఫ్‌లో బాగా జరిగిందన్నారు. ఇదే ప్రక్రియను మరింత బలోపేతం చేయాల్సిందిగా సూచించారు. క్యాంప్‌ కార్యాలయంలో వ్యవసాయశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించి సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇ-క్రాప్‌ డేటా మేరకు ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. రైతులకు ఎక్కడా నష్టం జరక్కూడద న్నారు. ఏమైనా సమస్యలున్నా, మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం ఉన్నా ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక నంబర్‌ను ఏర్పాటు- చేయాలని, రైతులు ఫిర్యాదు చేయగానే వెంటనే స్పందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ అంశాలన్నీ రశీదులమీద స్పష్టంగా పేర్కొవాలన్నారు. ఇప్పటి వరకు రూ. 5,373 కోట్లు- విలువైన ధాన్యాన్ని సేకరించామని, రైతులకు 89 శాతం చెల్లింపులు జరిపామని అధికా రులు సీఎంకు వివరించారు. ఫిబ్రవరి రెండో వారం వరకు ధాన్యం సేకరణ కొనసాగించాల్సిందిగా సీఎం సూచించారు. స్థానిక వీఏఓ, డీఆర్‌ఓ నుంచి సర్టిఫై చేసిన తర్వాతనే సేకరణ ముగిస్తామని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img