Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఆక్రమణలు తక్షణమే ఖాళీ చేయాలి


యూఎన్‌లో పాక్‌కు తేల్చి చెప్పిన భారత్‌

ఎప్పుడూ అంతర్జాతీయ వేదికలపై భారత్‌ గురించి అవాకులు చెవాకులు పేలినట్టే.. మరోసారి చేయబోయిన పాకిస్తాన్‌కు భారత్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చింది. భద్రతా మండలిలో పాక్‌ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తడంతో భారత్‌ దీటుగా స్పందించింది. జమ్మూ, కాశ్మీర్‌, లడఖ్‌లు భారత్‌లో అంతర్భాగమని, పాకిస్థాన్‌ అక్రమంగా ఆక్రమించిందని భారత్‌ స్పష్టం చేసింది. అక్రమ ఆక్రమణను తక్షణమే ఖాళీ చేయాలని భారత్‌ తేల్చి చెప్పింది.. యూఎన్‌లోని భారత కౌన్సలర్‌ డాక్టర్‌ కాజల్‌ భట్‌ దీనిపై మాట్లాడుతూ.. ాాపాకిస్తాన్‌తో సహా అన్ని పొరుగు దేశాలతో సాధారణ సంబంధాలను భారతదేశం కోరుకుంటుంది. వ్యయ సమస్య ఉంటే, సిమ్లా ఒప్పందం, లాహోర్‌ డిక్లరేషన్‌ ప్రకారం అది ద్వైపాక్షికంగా ఉండాలి్ణ్ణ అని చెప్పారు. అయితే ే చర్చలు, శాంతియుత సయోధ్య కోసం అహింసా వాతావరణం ఉండాలి. ఉగ్రవాదం, హింస లేని అనుకూల వాతావరణంలో మాత్రమే అర్థవంతమైన చర్చలకు ఆస్కారం ఉంటుందన్నారు. చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసే బాధ్యత పాకిస్థాన్‌పైనే ఉంటుందని ఆమె అన్నారు. అప్పటి వరకు సీమాంతర ఉగ్రవాదం పట్ల భారత్‌ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. భారత్‌పై యూఎన్‌ వేదికగా పాకిస్థాన్‌ తప్పుడు ప్రచారాలు చేయడం ఇది మొదటిసారి కాదు అని, ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు పాక్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తోందని, కానీ ఆ దేశంలో మాత్రం ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, సాధారణ ప్రజలకు, మైనార్టీలకు అక్కడ ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు. ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌ శాశ్వత ప్రతినిధి మునీర్‌ అక్రమ్‌ మరోసారి బహిరంగ చర్చ సందర్భంగా కాశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. దీంతో భారత్‌ స్పందించింది. దీనిపై బదులిస్తూ, జమ్మూ కాశ్మీర్‌, లడఖ్‌ మొత్తం కేంద్రపాలిత ప్రాంతం ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటుంది. ఇందులో పాకిస్థాన్‌ అక్రమ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి. అక్రమంగా ఆక్రమించిన అన్ని ప్రాంతాలను తక్షణమే ఖాళీ చేయాలని పాకిస్థాన్‌ను కోరుతున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img